తెలంగాణకు మహిళా మంత్రి లేని లోటును తమిళిసై తీర్చాలి: విజయశాంతి
Add ap7am to your home Screen

తెలంగాణకు మహిళా మంత్రి లేని లోటును తమిళిసై తీర్చాలి: విజయశాంతి

  • తెలంగాణ కొత్త గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్
  • రేపు ప్రమాణస్వీకారం
  • తెలంగాణ సర్కారులో ఇప్పటికీ మహిళా మంత్రి లేరన్న విజయశాంతి
తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్ నియమితురాలైన సంగతి తెలిసిందే. ఆమె రేపు ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత విజయశాంతి నూతన గవర్నర్ రాకను స్వాగతించారు. తమిళిసైకి విషెస్ తెలిపారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు అందుకుంటున్న తమిళిసై మహిళా మంత్రి లేని లోటు తీర్చాలని ఆకాంక్షించారు.

క్యాబినెట్ లో మహిళా మంత్రులు లేనందున తమ సమస్యలు పట్టించుకునేవారు లేరనే అభిప్రాయం మహిళల్లో ఏర్పడిందని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. కేసీఆర్ ఇప్పటికి రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చినా నేటికీ ఓ మహిళా మంత్రికి తన క్యాబినెట్ లో చోటివ్వలేదని విమర్శించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మల్లారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని రాములమ్మ వ్యాఖ్యానించారు. 
Vijayasanthi
Telangana

More Telugu News