V.V.Vinayak: వినాయక్ దర్శకత్వంలో రామ్!

షార్ట్స్‌లో చూడండి
రామ్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సినిమా తరువాత ఆయన కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయవలసి వుంది. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కొంత సమయం పడుతుందని తెలుస్తోంది. మళ్లీ మాస్ టచ్ వున్న పాత్రనే చేయాలనుకున్న రామ్, వీవీ వినాయక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

వీవీ వినాయక్ కూడా హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా మొదలుకావడానికి ఇంకా చాలా సమయం వుంది. అందువలన ఈ లోగా దర్శకుడిగా మరో సినిమా చేయాలనే ఉద్దేశంతో ఆయన రామ్ కి ఒక కథ వినిపించాడట. మాస్ మసాలా అంశాలు పుష్కలంగా వున్న ఈ కథ రామ్ కి బాగా నచ్చేయడంతో ఓకే చెప్పేశాడని అంటున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Go Back to Shorts
V.V.Vinayak
Ram

More Telugu News