నాడు కొడుకు కార్తి గడిపిన జైలు గదిలోనే నేడు తండ్రి చిదంబరం!

  • గత సంవత్సరం 12 రోజుల పాటు 7వ నంబర్ గదిలో కార్తి
  • నేడు అదే గదిలో తండ్రి చిదంబరం
  • గత రాత్రి ఆయనకు అన్నం, పప్పు పెట్టిన అధికారులు
గత సంవత్సరం తన కుమారుడు కార్తి చిదంబరం తీహార్ జైలులో ఏ గదిలోనైతే 12 రోజులు గడిపారో, నేడు అదే గదిలోకి తండ్రి చిదంబరం చేరారు. సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో భాగంగా అరెస్టయిన తరువాత, బెయిల్ ను నిరాకరిస్తూ, కోర్టు రిమాండ్ ను విధించడంతో నిన్న రాత్రి ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. అందులోని 7వ నంబర్ గదిని చిదంబరానికి కేటాయించారు.

కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించామని, వెస్ట్రన్ టాయిలెట్ అందులో ఉందని, ఆయన లైబ్రరీని వాడుకోవచ్చని, టీవీ చూడవచ్చని కూడా జైలు అధికారులు తెలిపారు. రాత్రి భోజనంలో ఆయనకు అన్నం, పప్పు, రోటి, కూర ఇచ్చామని తెలిపారు. ఉదయం 7 నుంచి 8 మధ్య అల్పాహారం ఇస్తామని చెప్పారు. జైల్లో ఉన్న మంచి నీటి ప్లాంట్ నుంచి శుద్ధి చేయబడిన నీటిని ఆయన తాగవచ్చని, లేకుంటే క్యాంటీన్ లో కొనుక్కోవచ్చని అన్నారు.
Go Back to Shorts
Chidambaram
Tihar
Jail
Karti

More Telugu News