వేదికపై పేలిన బాణసంచా... స్పానిష్ గాయని సజీవదహనం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేదికపై పేలిన బాణసంచా... స్పానిష్ గాయని సజీవదహనం!

  • స్పెయిన్ లో ప్రముఖ స్టార్ గా ఉన్న జోయానా సెయిన్స్
  • కడుపులోకి దూసుకెళ్లిన రాకెట్
  • ఆసుపత్రికి తరలించేలోగా మృతి
ఉల్లాసంగా, ఉత్సాహంగా సంగీత కార్యక్రమం జరుగుతున్న వేళ, పేలిన బాణసంచా, ఓ గాయని నిండు ప్రాణాన్ని వేదికపైనే బలిగొంది. ఓ మ్యూజికల్‌ షోలో  ప్రముఖ స్పానిష్‌   పాప్‌ స్టార్‌, డాన్సర్‌ జోయానా సెయిన్స్‌... సూపర్ హాలీవుడ్ ఆర్కెస్ట్రా బృందంతో కలిసి షో నిర్వహిస్తున్న వేళ, ఈ ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం, బాణాసంచా కాల్చుతుండగా, రెండు రాకెట్లు వేదికపైకి దూసుకొచ్చాయి. వాటిల్లో ఒకటి జోయానా సెయిన్స్ కడుపులోకి దూసుకుపోయింది. ఆమె శరీరంపైనే పేలింది. దీంతో మంటలంటుకోవడంతో, వాటిల్లో జోయానా చిక్కుకు పోయింది. స్పృహలేని స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు పోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేయగా, జోయానా ఆకస్మిక మరణంపై గ్రూప్‌ ప్రమోటర్లు తమ సంతాపాన్ని వెలిబుచ్చారు.
Spain
Singer
Fire Crakers
Died

More Telugu News