సాహో సినిమాపై కేటీఆర్ ప్రశంసలు.. దర్శక నిర్మాతలకు కొత్త ప్రమాణాలు నిర్దేశించిందంటూ ట్వీట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాహో సినిమాపై కేటీఆర్ ప్రశంసలు.. దర్శక నిర్మాతలకు కొత్త ప్రమాణాలు నిర్దేశించిందంటూ ట్వీట్

  • ఇదో సాంకేతిక అద్భుతం
  • సుజీత్, ప్రభాస్‌కు అభినందనలు
  • ‘ఎవరు’ సినిమా సూపర్
టాలీవుడ్ నటుడు ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా అద్భుతంగా ఉందని టీఆర్ఎస్ ముఖ్యనేత, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ఈ సినిమా ఓ సాంకేతిక అద్భుతమని ట్వీట్ చేశారు. సినిమా దర్శకుడు సుజీత్, నటుడు ప్రభాస్‌కు అభినందనలు తెలిపారు. భారతీయ సినిమా నిర్మాతలు, దర్శకులకు ఈ సినిమా కొత్త ప్రమాణాలను నిర్దేశించిందన్నారు.  

సాహో సినిమాను మెచ్చుకున్న కేటీఆర్, మరోపక్క ‘ఎవరు’ సినిమాపైనా ప్రశంసలు కురిపించారు. హీరోహీరోయిన్లు అడివి శేషు, రెజీనాలు అద్భుతంగా నటించారని అన్నారు. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. కాగా, శుక్రవారం విడుదలైన సాహో సినిమా డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్ల పరంగా దూసుకుపోతోంది.
KTR
sahoo
Prabhas
Tollywood

More Telugu News