తెలంగాణలో నేడు, రేపు కుమ్మేయనున్న వర్షాలు

  • ఉత్తర, తూర్పు తెలంగాణకు భారీ వర్ష సూచన
  • మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్ప పీడనం
  • కొనసాగుతున్న ఆవర్తన ప్రభావం
తెలంగాణ వ్యాప్తంగా నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్న అధికారులు.. మరో 24 గంటల్లో వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక, ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కాగా, గత రెండుమూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి.  
Go Back to Shorts
Telangana
Rains
bay of bengal

More Telugu News