టెక్సాస్‌లో రక్తం కళ్లజూసిన గన్.. కాల్పుల్లో ఐదుగురి మృతి

  • ఒడెస్సా ప్రాంతంలో కాల్పులు
  • తీవ్రంగా గాయపడిన మరో 21 మంది 
  • ఓ దుండగుడిని కాల్చి చంపిన పోలీసులు
అమెరికాలోని టెక్సాస్‌లో గన్ మరోమారు గర్జించింది. ఐదుగురి ప్రాణాలు పొట్టనబెట్టుకుంది. ఒడెస్సా ప్రాంతంలో ఇద్దరు దుండగులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఓ దుండగుడిని హతమార్చారు. కాగా, క్షతగాత్రుల్లో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. టొయోటా వాహనంలో వచ్చిన దుండగులు ఓ పోస్టల్ వ్యాన్‌ను దొంగిలించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తప్పించుకున్న దుండగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Go Back to Shorts
America
texas
gun fire

More Telugu News