యూఎస్ ప్రీమియర్స్ లో 'సాహో' వసూళ్ల వర్షం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూఎస్ ప్రీమియర్స్ లో 'సాహో' వసూళ్ల వర్షం

  • ప్రీమియర్స్ ద్వారా రూ.6.15 కోట్లు వసూలు చేసిన సాహో
  • మహర్షి చిత్రం రికార్డు అధిగమించిన ప్రభాస్ మూవీ
  • చెక్కుచెదరని బాహుబలి-2 రికార్డు
ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన హైవోల్టేజ్ యాక్షన్ మూవీ సాహో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందుగానే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్రదర్శించగా, భారీ వసూళ్లు లభించాయి. కేవలం ప్రీమియర్స్ ద్వారానే రూ.6.15 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. 2019లో యూఎస్ ప్రీమియర్స్ ద్వారా అత్యధికంగా కలెక్ట్ చేసిన చిత్రాల్లో మహర్షి చిత్రం రూ.3.65 కోట్లతో టాప్ లో ఉంది. ఇప్పుడా రికార్డును సాహో అధిగమించింది. అయితే, ప్రభాస్ తన బాహుబలి చిత్రాల రికార్డును మాత్రం అధిగమించలేకపోయాడు. బాహుబలి-2 ప్రీమియర్స్, తొలి రోజు వసూళ్లతో కలిపి ఏకంగా రూ.32 కోట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.
Saaho
Prabhas
USA

More Telugu News