'సాహో'కి ప్రత్యేక అనుమతి... రోజుకు ఆరు షోలు, టికెట్ రేట్ల పెంపునకు ఏపీ సర్కార్ ఓకే!
- ప్రత్యేక అనుమతుల మంజూరు
- రెండు వారాల పాటు పెరిగిన టికెట్ ధరల అమలు
- హై బడ్జెట్ మూవీ అయినందునే అంటున్న అధికారులు
వాస్తవానికి బీ, సీ సెంటర్ థియేటర్లలో రోజుకు నాలుగు షోలు వేస్తారు. ఇటీవలి కాలంలో కొన్ని చిత్రాలకు ఐదు షోలకు అనుమతి లభించింది. ఇప్పుడు ఏకంగా ఆరు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అంగీకరించడం గమనార్హం. పెరిగిన టికెట్ రేట్లు ప్రధాన సెంటర్లలో రెండు వారాల పాటు, మిగతా సెంటర్లలో వారం పాటు అమలులో ఉండనున్నాయి. సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించినది కావడంతోనే ఇలా ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్టు ప్రభుత్వ అధికారులు అంటున్నారు.