Balakrishna: పోలీస్ జీపులోనే బాలకృష్ణ షూటింగుకి వచ్చేవారు: దర్శకుడు బి.గోపాల్

షార్ట్స్‌లో చూడండి
ఎమోషన్ తో కూడిన యాక్షన్ చిత్రాలకి పెట్టింది పేరుగా బి.గోపాల్ కనిపిస్తారు. బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు ఘన విజయాలను అందుకున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన విజయవంతమైన చిత్రాలలో ఒకటిగా 'రౌడీ ఇన్ స్పెక్టర్' కనిపిస్తుంది.

తాజాగా బి.గోపాల్ మాట్లాడుతూ .. "బాలకృష్ణ గారితో నేను చేసిన సినిమాల్లో 'రౌడీ ఇన్ స్పెక్టర్' ముందువరుసలో కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగు సమయంలో బాలకృష్ణ నిజంగానే పోలీస్ ఆఫీసర్ గా ఫీలయ్యేవారు. పాత్రలో ఇమిడిపోవడం కోసం నడక నుంచి డైలాగ్ డెలివరీ వరకూ ప్రతి విషయంలోను ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. తను ఒక పోలీస్ ఆఫీసర్ అనే విషయాన్ని ఓన్ చేసుకోవడం కోసం ఆయన షూటింగు కోసం ఏర్పాటు చేయబడిన పోలీస్ జీపులోనే సెట్ కి వచ్చేవారు. పోలీస్ జీపు పంపిస్తేనే షూటింగుకి వస్తానని ఆయన షరతు పెట్టడం వల్ల, అలాగే చేసే వాళ్లం" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Balakrishna
Gopal

More Telugu News