చిదంబరంకు షాక్.. బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ పిటిషన్ కొట్టివేత
- సీబీఐ అరెస్ట్ లో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్య
- కింద కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని సూచన
ఢిల్లీ హైకోర్టు చిదంబరంకు బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆయన తరపున న్యాయవాదులైన కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్విలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మరోవైపు, ఈ రోజుతో చిదంబరంకు సీబీఐ కస్టడీ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో, కస్టడీని పొడిగించాల్సిందిగా సీబీఐ ప్రత్యేక కోర్టును సీబీఐ అధికారులు కోరనున్నారు. చిదంబరం విచారణలో కీలక ఆధారాలు లభించాయని... దీంతో, మరింత లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని, కస్టడీని పొడిగించాలని కోర్టును కోరనున్నట్టు సమాచారం.