నేను పెళ్లి చేసుకుంటే మహిళాభిమానులు హర్ట్ అవుతారు: హీరో ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను పెళ్లి చేసుకుంటే మహిళాభిమానులు హర్ట్ అవుతారు: హీరో ప్రభాస్

  • పెళ్లి విషయంపై స్పందించిన ప్రభాస్ 
  • పెళ్లి అనేది ప్రేమలో భాగమే
  • తెరపై ముద్దు సీన్స్ ఇబ్బందేనన్న ప్రభాస్  
దేశవ్యాప్తంగా ప్రభాస్ కి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మాస్ ఆడియన్స్ లో ఆయనకి వున్న ఇమేజ్ మరింత ఎక్కువ. ఇక ఆయనని ఆరాధించే మహిళాభిమానులు కూడా ఎక్కువే. తాజా ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన రావడంతో, ప్రభాస్ తనదైన శైలిలో స్పందించాడు.

"ఎక్కడికి వెళ్లినా నా పెళ్లి గురించే మాట్లాడుతున్నారు. పెళ్లి అనేది ప్రేమలో ఒక భాగమనేది నా ఉద్దేశం. నా పెళ్లి విషయం కొంతమంది అభిమానులకు ఆనందాన్ని కలిగించవచ్చు .. లేడీ ఫ్యాన్స్ మాత్రం హర్ట్ అవుతారు" అంటూ నవ్వేశాడు. "తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించవలసి వచ్చినప్పుడు నాకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది" అంటూ ఆయన మరో ప్రశ్నకి సమాధానంగా చెప్పాడు. ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ... తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమా సందడి చేయనుంది.
Prabhas
Shraddha Kapoor

More Telugu News