Tamilnadu: తమిళనాడులో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల అరెస్ట్!

షార్ట్స్‌లో చూడండి
తమిళనాడులోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న వార్తలు గతవారం తీవ్ర కలకలం రేపగా, కోయంబత్తూరులో ఇద్దరు అనుమానిత లష్కరే తోయిబా ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సిట్ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని, వీరిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది.

కాగా, గత వారం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఉగ్రవాదుల సంచారంపై సమాచారం అందడంతో తమిళనాడు పోలీసులు అలర్ట్ అయిన సంగతి తెలిసిందే. అన్ని ప్రధాన పట్టణాల్లో పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు నిర్వహించారు. గతంలో కోయంబత్తూరులో ఉగ్రవాదుల దాడులు జరగడంతో మరోసారి అదే తరహా దాడులు జరుగుతాయన్న భయాందోళనలు ప్రజల్లో నెలకొనివున్నాయి.

పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులు సముద్రమార్గం ద్వారా శ్రీలంక మీదుగా భారత్ లోకి ప్రవేశించి, వివిధ నగరాల్లోకి చొరబడినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Go Back to Shorts
Tamilnadu
Police
Terrorisst
Arrest

More Telugu News