తదుపరి భారత ప్రధాని చిదంబరమే... పాకిస్థాన్ సెనేటర్ సంచలన వ్యాఖ్యలు!
- చిదంబరం అరెస్ట్ పై పాక్ సెనేటర్ రెహ్మాన్ మాలిక్ స్పందన
- కశ్మీర్ ప్రజల తరఫున గళం విప్పినందుకే చిదంబరంను అరెస్ట్ చేశారంటూ ట్వీట్
- ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలు చిదంబరానికి ఉన్నాయంటూ వ్యాఖ్యలు
కశ్మీర్ లో మోదీ అక్రమ చర్యలకు నిరసనగా గళం విప్పినందుకే చిదంబరంను అరెస్ట్ చేశారని రెహ్మాన్ మాలిక్ అభిప్రాయపడ్డారు. కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడంపై ప్రశ్నించడంతో పాటు, అక్కడి అణగారిన ప్రజల తరఫున గొంతుక వినిపించడం కూడా ఆయన అరెస్ట్ కు కారణమైందని పేర్కొన్నారు. "గుర్తుంచుకోండి, మీ తర్వాతి ప్రధాని చిదంబరమే. ప్రధాని అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్న రాజకీయవేత్త చిదంబరం" అంటూ రెహ్మాన్ మాలిక్ ట్వీట్ చేశారు.