ఈడీ కేసులో చిదంబరానికి ముందస్తు బెయిల్ మంజూరు
- సీబీఐ అరెస్టును సవాల్ చేసిన చిదంబరం
- ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల 26కు వాయిదా
- ఈడీ నుంచి రక్షణ కోరుతూ వేసిన మరో పిటిషన పై ‘సుప్రీం’ విచారణ
ఇదే కేసు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తులో ఉండటంతో, ఈడీ నుంచి రక్షణ కోరుతూ చిదంబరం దాఖలు చేసిన మరో పిటిషన్ పైనా అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణ జరిపింది. చిదంబరానికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 26 వరకూ ఆయన్ని అరెస్టు చేయొద్దని ఆదేశించింది. సీబీఐ, ఈడీ కేసులపై సోమవారం మరోసారి విచారణ జరుపుతామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.