స్పెయిన్ లో విజృంభిస్తున్న లిస్టీరియా వ్యాధి.. ప్రపంచదేశాలను హెచ్చరించిన స్పానిష్ ప్రభుత్వం!
- ఇప్పటివరకూ 150 కేసులు నమోదు
- వ్యాధి కారణంగా ఓ పెద్దావిడ మృతి
- పర్యాటకులకు సోకి ఉండవచ్చని స్పెయిన్ ప్రకటన
‘లా మెచా’ అనే బ్రాండ్ కింద విక్రయిస్తున్న సరిగ్గా ఉడకని మాంసంలో ఈ లిస్టీరియా బ్యాక్టీరియా మూలాలను గుర్తించామని మంత్రి మారియా చెప్పారు. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీని మూసివేయడంతో పాటు ఉత్పత్తులను సీజ్ చేశామన్నారు. తమ దేశంలో ఇటీవలి కాలంలో పర్యటించిన టూరిస్టులకు ఈ వ్యాధి సోకిఉండవచ్చని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. లిస్టీరియా అనే బ్యాక్టీరియా కారణంగా కొంత అస్వస్థతకు లోనవుతారు. అయితే గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి పాలిట ఈ బ్యాక్టీరియా ప్రాణాంతకంగా మారుతుంది.