కాంగ్రెస్ నేత చిదంబరం అరెస్ట్ పై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి!
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్ట్
- ముడుపులు అందుకున్నారని కేసు నమోదు
- తమకు సంబంధం లేదన్న కిషన్ రెడ్డి
ఈరోజు ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘చట్టం తన పని తాను చూసుకుపోతుంది. చిదంబరం విషయంలో కోర్టులు తుది నిర్ణయం తీసుకుంటాయి. చిదంబరం అరెస్ట్ తో కేంద్ర ప్రభుత్వానికీ, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. అవినీతిలో మునిగితేలినవారిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించాల్సింది కోర్టులే తప్ప ప్రభుత్వం కాదు’ అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.