ప్రభాస్ నోట్లో రవీనా టాండన్ చీరకొంగు... వైరల్ పిక్ చూశారా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ నోట్లో రవీనా టాండన్ చీరకొంగు... వైరల్ పిక్ చూశారా?

  • 'సాహో' ప్రమోషన్‌ లో బిజీగా ఉన్న ప్రభాస్
  • 'నాచ్ బలీయే-9'లో పాల్గొన్న యంగ్ రెబల్ స్టార్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు
ప్రస్తుతం తన కొత్త చిత్రం 'సాహో' సినిమా ప్రమోషన్‌ లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సల్మాన్‌ ఖాన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న 'నాచ్‌ బలియే-9' డ్యాన్స్‌ రియాలిటీ షోలో పాల్గొంటున్న వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఇదే కార్యక్రమంలో ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ రవీనా టాండన్ కూడా హాజరైన వేళ, ఓ పాటకు నృత్యం చేయాలని వారిద్దరినీ సల్మాన్ కోరారు. 'కిక్‌' సినిమాలోని 'జుమ్మేకీ రాత్‌ హై...' పాటకు తాను స్టెప్పులు వేస్తూ, ప్రభాస్, రవీనాలతో స్టెప్పులు వేయించారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, సుజీత్‌ దర్శకత్వంలో వస్తున్న 'సాహో'లో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, అరుణ్‌ విజయ్‌, మురళీ శర్మ, వెన్నెల కిశోర్‌, మందిరా బేడీ తదితరులు నటించిన సంగతి తెలిసిందే.
Sahoo
Prabhas
Ravina Tandon
Salman Khan

More Telugu News