'సాహో' విషయంలో టెన్షన్ వుంది: హీరో ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' విషయంలో టెన్షన్ వుంది: హీరో ప్రభాస్

  • ఈ నెల 30న రానున్న 'సాహో'
  • ప్రమోషన్స్ పనులు మొదలు 
  • రెండేళ్లు వెచ్చించానన్న ప్రభాస్
ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలైపోయాయి.

తాజాగా ప్రభాస్ మాట్లాడుతూ .. 'సాహో' విషయంలో టెన్షన్ పడుతున్నారా? అని చాలామంది అడుగుతున్నారు. ఇంత భారీ బడ్జెట్ తో సినిమా చేశాక టెన్షన్ లేకండా ఎలా ఉంటుంది? 'సాహో' కోసం రెండేళ్ల సమయాన్ని వెచ్చించాను .. ఎంతో కష్టపడ్డాను. అందుకు తగిన ఫలితం వస్తుందో లేదోననే ఆందోళన సహజంగానే ఉంటుంది. ఇంతకాలం పాటు సాంకేతిక నిపుణులు పడిన కష్టం గురించీ, ఖర్చుకు వెనకాడకుండా ముందుకెళ్లిన నిర్మాతల గురించిన ఆలోచన ఉంటుంది. అహర్నిశలూ శ్రమించినా ఆందోళన వుంది .. అందరి కృషి ఫలిస్తుందనే ఆశ వుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
Prabhas
Shraddha Kapoor

More Telugu News