రిజర్వేషన్లపై మరోసారి స్పందించిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్
- రిజర్వేషన్లపై శాంతియుత చర్చలు జరగాలి
- రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నవారి భావాలను అర్థం చేసుకోవాలి
- వ్యతిరేకించేవారి భావాల గురించి కూడా ఆలోచించాలి
గతంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ, రిజర్వేషన్లపై పున:సమీక్షించాలని కోరారు. ఈ వ్యాఖ్యలు పెను దుమరాన్నే రేపాయి. వివిధ కుల, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఆ తర్వాత ఆయన మరెప్పుడూ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడలేదు. నిన్న ఢిల్లీలో జరిగిన 'జ్ఞాన్ ఉత్సవ్' ముగింపు సభలో ప్రసంగిస్తూ, రిజర్వేషన్లపై శాంతియుత చర్చలు జరగాలని కోరారు.