బిగ్‌బాస్3: రోహిణ్ అవుట్.. బోరున ఏడ్చేసిన శివజ్యోతి!
Add ap7am to your home Screen

బిగ్‌బాస్3: రోహిణ్ అవుట్.. బోరున ఏడ్చేసిన శివజ్యోతి!

  • హౌస్‌లో భావోద్వేగ సన్నివేశం
  • రోహిణి ఎలిమినేట్ అయినట్టు చెప్పగానే వెక్కివెక్కి ఏడ్చేసిన శివజ్యోతి
  • తనవల్లే రోహిణి ఎలిమినేట్ అయిందంటూ పశ్చాత్తాపం
స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ సీజన్ 3 రియాలిటీ షోలో ఆదివారం భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. షో మొత్తం సరదాగా సాగిన వేళ చివరి పది నిమిషాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎలిమినేషన్‌లో ఉన్న శివజ్యోతి, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణిలలో తొలి  ఆరుగురు సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోగా రోహిణి షో నుంచి ఎలిమినేట్ అయింది.  

రోహిణి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించగానే శివజ్యోతి తట్టుకోలేకపోయింది. వెక్కివెక్కి ఏడ్చేసింది. రోహిణి ఎలిమినేషన్‌కు తానే కారణమన్న బాధతో బోరున విలపించింది. నామినేషన్ సమయంలో కన్‌ఫెషన్ రూం నుంచి బయటకు వచ్చాక ఇతర సభ్యులతో సైగల ద్వారా ఎవరు నామినేట్ అయింది చెప్పడాన్ని చూసిన బిగ్‌బాస్.. శివజ్యోతి, రోహిణిలు ఇద్దరినీ ఎలిమినేషన్‌కు నామినేట్ చేశాడు.

అయితే, ప్రేక్షకుల ఓట్లతో శివజ్యోతి బయటపడగా, రోహిణి షో నుంచి ఎలిమినేట్ అయింది. తనవల్లే రోహిణి ఎలిమినేట్ అయిందంటూ పశ్చాత్తాపంతో శివజ్యోతి ఏడ్చేసింది. తన చెంపపై కొట్టుకుంటూ కన్నీరు పెట్టుకుంది. రోహిణి కూడా భావోద్వేగానికి గురైంది. ఏడుస్తూనే హౌస్‌ను వదిలింది.    
Bigboss
star maa
reality show
rohini

More Telugu News