ప్రభాస్ మైండ్ పెద్ద హార్డ్ డిస్క్: దర్శకుడు సుజీత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ మైండ్ పెద్ద హార్డ్ డిస్క్: దర్శకుడు సుజీత్

  • రామోజీ ఫిలింసిటీలో సాహో ప్రీరిలీజ్ ఈవెంట్
  • నాలుగేళ్ల కిందట చెప్పినవి కూడా గుర్తుంచుకుంటాడని కితాబు
  • రెండేళ్ల కిందట ట్రైలర్ చివరి సీన్ గురించి చెబితే ఇప్పటికీ మర్చిపోలేదని వెల్లడి
సాహో ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సుజీత్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. హీరో ప్రభాస్ మెదడును పెద్ద హార్డ్ డిస్క్ తో పోల్చాడు. ఎప్పుడో నాలుగేళ్ల కిందట చెప్పినవి కూడా గుర్తుంటుందని తెలిపాడు. ట్రైలర్ చివరిలో ప్రభాస్ తల నుంచి రక్తం వచ్చే సన్నివేశం ఉంటుందని, ఈ సీన్ గురించి ప్రభాస్ కు ఎప్పుడో రెండేళ్ల కిందట చెబితే ఇప్పటికీ ఆయన మర్చిపోలేదని వివరించాడు.

మొదట్లో తాను షార్ట్ ఫిలింస్ తీసేవాడ్నని, తాను తీసిన ఓ షార్ట్ ఫిలిం డీవీడీ చూసిన ప్రభాస్ వెంటనే కబురు పంపారని, కానీ సరదాగా అన్నారేమోనని సీరియస్ గా తీసుకోలేదని సుజీత్ తెలిపాడు. కొన్నిరోజులకు వెళితే, ఏమైంది డార్లింగ్, అప్పుడు పిలిస్తే ఇప్పుడొచ్చావు అంటూ అడిగాడని, ప్రభాస్ కు అపారమైన జ్ఞాపకశక్తి ఉందని పేర్కొన్నాడు.
Prabhas
Saaho
Tollywood

More Telugu News