gurunanak: నేడు గురునానక్ జయంతి.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

షార్ట్స్‌లో చూడండి
సిక్కుల తొలి గురువు గురునానక్ దేవ్‌జీ 550వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గురునానక్ జయంతిని పురస్కరించుకుని సిక్కులు పెద్ద ఎత్తున ర్యాలీని తలపెట్టారు. ఘట్‌కేసర్ నుంచి ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమయ్యే ర్యాలీ  ఎల్‌బీ నగర్‌ మీదుగా దిల్‌సుక్‌నగర్‌, మలక్‌పేట‌, చాదర్‌ఘాట్‌ జంక్షన్‌, రంగ్‌మహల్‌ జంక్షన్‌ తదితర ప్రాంతాల గుండా సాగుతూ గురుద్వారా సాహెబ్‌ బారం బాల సిఖ్‌ చావ్‌నీకి చేరుకోనుంది.

ఈ నేపథ్యంలో ర్యాలీ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ట్రాఫిక్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. రాత్రి 9 గంటల వరకు ర్యాలీ జరుగుతుందని పేర్కొన్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.
Go Back to Shorts
gurunanak
sikh
rally
Hyderabad
traffic

More Telugu News