మోదీ ప్రసంగంలో మూడు అంశాలు నచ్చాయి: చిదంబరం

  • జనాభాను తగ్గించడం, ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను నిషేధించడం, సంపదను సృష్టించే వారిని గౌరవించడం అనేవి మంచి నిర్ణయాలు
  • ప్రతి ఒక్కరూ వీటిని స్వాగతించాలి
  • సంపదను సృష్టించే వారిని గౌరవించడం అనేదాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి మరోసారి వినాలి
స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు. మోదీ ప్రసంగంలో తనకు మూడు ప్రకటనలు నచ్చాయని చెప్పారు. జనాభాను తగ్గించడం, ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ను నిషేధించడం, సంపదను సృష్టించే వారిని గౌరవించడం అనే మూడు మంచి నిర్ణయాలని అన్నారు. మోదీ చేసిన ఈ మూడు ప్రకటనలను ప్రతి ఒక్కరు స్వాగతించాలని చెప్పారు. జనాభా, ప్లాస్టిక్ కు సంబంధించిన అంశాలు ప్రజలతో ముడిపడి ఉన్నవని... వీటి కోసం ఎన్నో సామాజిక సేవా సంస్థలు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నాయని తెలిపారు. సంపదను సృష్టించే వారిని గౌరవించాలంటూ మోదీ చెప్పిన మాటలను కేంద్ర ఆర్థిక మంత్రి, ట్యాక్స్ అధికారులు, విచారణ సంస్థలు అధికారులు మరోసారి వినాలని, పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించారు.
Go Back to Shorts
Modi
Chidambaram
BJP
Congress

More Telugu News