పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. వరద ముప్పులో చంద్రబాబు నివాసం
- పులిచింతల నుంచి భారీగా వరదనీరు
- ప్రమాదంలో కృష్ణా కరకట్ట
- ఇప్పటికే పలు నిర్మాణాల్లోకి వరద నీరు
ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండడంతో 5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఫలితంగా కృష్ణా కరకట్ట ప్రమాదంలో పడింది.