ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్ పూర్తిస్థాయి బాధ్యతలు... ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!
- ఆర్పీ ఠాకూర్ స్థానంలో డీజీపీగా వచ్చిన సవాంగ్
- ఇప్పటివరకు ఇన్ చార్జ్ డీజీపీగా కొనసాగిన సవాంగ్
- కేంద్రం సూచనలతో పూర్తిస్థాయి డీజీపీగా నియామకం
అయితే, పూర్తిస్థాయి డీజీపీ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురి పేర్లతో ఓ జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఆ జాబితాను పరిశీలించిన యూపీఎస్సీ కమిటీ ముగ్గురి పేర్లతో తుది జాబితాను తిరిగి ఏపీ ప్రభుత్వానికి పంపగా, ఆ తుది జాబితాలో ఉన్న గౌతమ్ సవాంగ్ ను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 1986 బ్యాచ్ కు చెందిన గౌతమ్ సవాంగ్ ఇప్పటివరకు పలు కీలక బాధ్యతల్లో సమర్థంగా పనిచేశారు.