రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లే షెడ్యూల్ లో స్వల్ప మార్పు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోజా ఇంటికి కేసీఆర్ వెళ్లే షెడ్యూల్ లో స్వల్ప మార్పు

  • షెడ్యూల్ ప్రకారం రోజా ఇంటికి వెళ్లాల్సిన కేసీఆర్
  • సమయాభావం వల్ల షెడ్యూల్ లో స్వల్ప మార్పు
  • మధ్యాహ్నం 3 గంటలకు రోజా ఇంటికి వెళ్లే అవకాశం
తిరుమల, కంచి పర్యటనకు గాను బయల్దేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపటి క్రితం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం కంచికి వెళ్లే మార్గంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంటికి కేసీఆర్ వెళ్తారని పేర్కొన్నారు. రోజా నివాసంలో తేనీటిని సేవిస్తారని అనుకున్నారు. అయితే, సమయాభావం వల్ల షెడ్యూల్ లో చిన్న మార్పు చేశారు. స్వామివారి దర్శనానంతరం మధ్యాహ్నం 3 గంటలకు రోజా ఇంటికి కేసీఆర్ వెళ్తారని తెలిసింది. కేసీఆర్ వెంట ఆయన భార్య, కుమార్తె కవిత, కొందరు టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. రేణిగుంట విమానాశ్రయంలో కేసీఆర్ కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.
KCR
TRS
Tirupati
Roja
YSRCP

More Telugu News