నది వద్ద యువకుడి సెల్ఫీ... ఓ ప్రాణం కాపాడిన వైనం!
- కర్ణాటకలోని తుంగభద్ర వంతెనపై ఘటన
- సెల్ఫీలో కనిపించిన వృద్ధుడు
- ప్రాణాలు కాపాడిన స్థానికులు
ఇదే సమయంలో సెల్ఫీలో రోడ్డుకు అవతలివైపున ఓ వృద్ధుడు నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమవుతూ గట్టు ఎక్కి కనిపించాడు. వెంటనే వెనక్కి తిరిగి చూసిన యువకుడు, అతను ఆత్మహత్యకు యత్నిస్తున్నట్టు అర్థమైంది. ఆ వెంటనే గట్టిగా కేకలు వేశాడు. ఇంతలో అప్రమత్తమైన చుట్టుపక్కల వారు పరుగులు పెడుతూ వచ్చారు. అతన్ని కాపాడారు. ఇప్పుడా చిత్రం తెగ వైరల్ అవుతోంది.