చిరంజీవీ గారు మెస్సేజ్ చేస్తే నేను ఫోన్ చేశా..గ్రేట్ ఫీలింగ్ అది: హీరో ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవీ గారు మెస్సేజ్ చేస్తే నేను ఫోన్ చేశా..గ్రేట్ ఫీలింగ్ అది: హీరో ప్రభాస్

  • ‘సాహో’ ట్రైలర్ గురించిన ప్రస్తావన
  • రాజమౌళి గారు చాలా హ్యాపీ ఫీలయ్యారు
  • ‘గోపీకృష్ణా మూవీస్’ బేనర్ లో సినిమా చేస్తున్నా
‘సాహో’ ట్రైలర్ గురించి ప్రముఖులు ఏమనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు హీరో ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సాహో’ చిత్రయూనిట్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిస్తూ, ‘ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారు చాలా హ్యాపీ ఫీలయ్యారు’ అని చెప్పాడు. ఈ సినిమా ట్రైలర్ బాగుందని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారని ప్రభాస్ గుర్తుచేసుకున్నారు. ‘చిరంజీవి గారు మెస్సేజ్ చేస్తే నేను ఫోన్ చేశాను. అది గ్రేట్ ఫీలింగ్’ అని చెప్పుకొచ్చాడు. ‘సాహో’ తర్వాత తాను నటిస్తున్న సినిమా ‘గోపీకృష్ణా మూవీస్’ బేనర్ లో చేస్తున్నానని, ఇది ఓ లవ్ స్టోరీ అని చెప్పారు.  
Chiranjeevi
Saho
Prabhas
Gopi krishna
movies

More Telugu News