గుంటూరు జిల్లాలో గుప్తనిధుల కలకలం.. 300 ఏళ్ల నాటి శివాలయం ధ్వంసం!

  • నంది విగ్రహాన్ని, స్తంభాన్ని ధ్వంసం చేసిన దుండగులు
  • గతంలోనూ ఈ ఆలయంలో తవ్వకాలు
  • దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులు
గుప్త నిధుల కోసం మూడు శతాబ్దాల నాటి శివాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అచ్చంపేట మండలంలోని వేల్పూరు శివాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రాచీన శివాలయంలో గుప్త నిధులు ఉన్నట్టు భావించిన దుండగులు తవ్వకాలు జరిపారు. ఓ స్తంభాన్ని, శివుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఆలయంలో గతంలోనూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు ఆలయ పూజారి తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Guntur District
Lord shiva temple
Andhra Pradesh

More Telugu News