హిందూపురం స్టీల్ ఫ్యాక్టరీలో బెంగళూరు ఐటీ అధికారుల సోదాలు!
- ఏ-1 స్టీల్ పరిశ్రమలో సోదాలు
- పలు కీలక పత్రాలు స్వాధీనం
- మీడియాకు అనుమతి నిరాకరణ
బెంగళూరు నుంచి వచ్చిన అధికారులు, ఏ-1 స్టీల్ కు సంబంధించిన అన్ని పరిశ్రమల్లోనూ దాడులు జరిపారు. ఇందులో భాగంగానే హిందూపురం వద్ద ఉన్న స్టీల్ పరిశ్రమలో కూడా సోదాలు చేసినట్టు తెలిసింది. ఐటీ అధికారులకు స్థానిక పోలీసులు సహకరించారు. కాగా, విషయం తెలుసుకున్న మీడియా పరిశ్రమలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అధికారులు అనుమతించక పోవడం గమనార్హం.