వరంగల్ లో 9 నెలల చిన్నారి హత్యాచారం కేసు.. రేపిస్టుకు ఉరిశిక్ష విధించిన కోర్టు!
- జూన్ 18న చిన్నారిని రేప్ చేసి చంపేసిన ప్రవీణ్
- సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అరెస్ట్ చేసిన పోలీసులు
- 48 రోజుల్లోనే తీర్పు ఇచ్చిన వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు
ఈ ఘటన ఇంటికి సమీపంలో ఏర్పాటుచేసిన సీసీటీవీలో రికార్డయింది. చిన్నారిని అక్కడి నుంచి తీసుకెళ్లిన ప్రవీణ్ ఆమెపై లైంగికదాడికి దిగాడు. ఈ సందర్భంగా నొప్పి భరించలేక చిన్నారి ఏడుస్తుండటంతో గొంతు నులిమి హత్యచేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణలో తానే ఈ నేరం చేశానని నిందితుడు ప్రవీణ్ ఒప్పుకోవడంతో ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.