సిక్స్ ప్యాక్ తో సిద్ధమవుతోన్న నాని
- నాని 24వ సినిమాగా 'గ్యాంగ్ లీడర్'
- 25వ సినిమాగా సెట్స్ పై 'వి'
- కీలకమైన పాత్రలో సుధీర్ బాబు
ఇక నాని తన 25వ సినిమాను మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేయనున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'వి' అనే టైటిల్ ను కూడా ఆల్రెడీ ఖరారు చేసేశారు. ఈ సినిమాలో నాని సీరియల్ కిల్లర్ గా కనిపించనున్నాడనే టాక్ కూడా బయటికి వచ్చింది. అంతేకాదు ఆయన సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తాడనేది తాజా సమాచారం. ఇందుకోసం ఆయన జిమ్ లో గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడట. సుధీర్ బాబు కీలకమైన పాత్రను చేస్తున్న ఈ సినిమాలో నాయికలుగా నివేదా థామస్ .. అదితీరావు కనిపించనున్నారు.