రాజకీయాల్లో రజనీతో కలిసి పనిచేయడం సాధ్యమే: కమలహాసన్
- రజనీగా మారి కమల్‌ను ఇంటర్వ్యూ చేసిన చేరన్
- నేను అనేది మనంగా మారితే కలిసి పనిచేయడం సాధ్యమేనన్న కమల్
- వైరల్ అవుతున్న వీడియో
ఈ సందర్భంగా చేరన్ (రజనీకాంత్) కమల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నటులుగా నాలుగు దశాబ్దాలపాటు కలిసి ప్రయాణించిన మనం ప్రజల ఆకాంక్షలను పూర్తి చేశామని, తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే, మీరు వచ్చేశారని అన్నాడు. నటులుగా ప్రజలను సంతృప్తి పరచడంలో విజయం సాధించిన మనం నాయకులుగానూ ఆ పని చేయగలమా? అని కమల్‌ను ప్రశ్నించాడు.
దీనికి కమల్ బదులిస్తూ.. అలా చేయడం కచ్చితంగా సాధ్యమేనని అన్నారు. ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమేనని, నేను అనేది మనంగా మారితే అది సాధ్యమవుతుందంటూ పరోక్షంగా రజనీతో కలిసి పనిచేయడం తనకిష్టమన్న సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.