తెలంగాణలో రేపటి నుంచి భారీ వర్షాలు: వాతావరణ శాఖ
Add ap7am to your home Screen

తెలంగాణలో రేపటి నుంచి భారీ వర్షాలు: వాతావరణ శాఖ

  • మరింత బలపడనున్న వాయుగుండం
  • తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
  • ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం
రానున్న 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం వాయవ్య బంగాళాఖాతంలో ప్రవేశించినట్టు పేర్కొంది. వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.  
rains
Telangana
bay of bengal

More Telugu News