అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకీ.. 9 మంది దుర్మరణం, 16 మందికి తీవ్రగాయాలు!
- ఒహాయో రాష్ట్రంలోని డేటన్ లో ఘటన
- బార్ పై కాల్పులు జరిపిన ఓ ఉన్మాది
- దుండగుడిని కాల్చిచంపిన పోలీసులు
దీంతో సహనం కోల్పోయిన సదరు వ్యక్తి తుపాకీ తీసి ఇష్టానుసారం కాల్పులు జరిపాడు. దీంతో బార్ లోని కస్టమర్లు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దుండగుడిని కాల్చిచంపారు. కాగా, ఈ ఘటనలో 9 మంది చనిపోగా, 16 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిని పోలీసులు అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. కాగా, నిందితుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందనీ, పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని డేటన్ పోలీసులు చెప్పారు.