ప్రభాస్ పెళ్లిపై ప్రచారంలో వున్న మరో వార్త
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ పెళ్లిపై ప్రచారంలో వున్న మరో వార్త

  • ప్రభాస్ పెళ్లిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త
  • అమెరికాలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయితో పెళ్లి
  • ఇరు కుటుంబాల మధ్య పూర్తయిన చర్చలు
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లిపై ఎప్పటికప్పుడు వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆయన పెళ్లి గురించి ఇప్పటికే ఎంతో ప్రచారం జరిగింది. సినీ నటి అనుష్కను పెళ్లాడబోతున్నాడంటూ కూడా అనేక సార్లు వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా, ఆయన పెళ్లికి సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అమెరికాలో స్థిరపడిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ పెళ్లాడబోతున్నాడనేదే ఆ వార్త. ఇప్పటికే పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య చర్చలు పూర్తయ్యాయని చెబుతున్నారు. దీనిపై ప్రభాస్ నుంచి కానీ, ఆయన కుటుంబసభ్యుల నుంచి కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి, ఈ వార్త నిజమా? లేక పుకారేనా? అనేది వేచి చూడాలి.
Prabhas
Marriage
Tollywood

More Telugu News