పోలవరం కాంట్రాక్టర్లను వైదొలగమని చెబితే నువ్వెందుకు ఉలిక్కిపడుతున్నావు ఉమా?: విజయసాయిరెడ్డి
- ఈ కాంట్రాక్టులను తమ బినామీలకు అప్పగించారు
- వేలకోట్ల రూపాయలను టీడీపీ నేతలు దోచుకున్నారు
- ఇప్పుడిదంతా వారికి పులివెందుల పంచాయతీలా కనిపిస్తుంది
ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘పోలవరం కాంట్రాక్టర్లను వైదొలగమని చెబితే దేవినేని ఉమా ఎందుకు ఉలిక్కి పడుతున్నావు? ప్రాజెక్టు పనులన్నిటినీ బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించి వేల కోట్ల కమిషన్లు దండుకున్నారు కదా. అడ్డంగా దొరికిన తర్వాత ఇది పులివెందుల పంచాయతీలా అనిపిస్తోందా?’ అని నిలదీశారు.