'సాహో' నుంచి హృదయాన్ని గిలిగింతలు పెట్టే పాట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' నుంచి హృదయాన్ని గిలిగింతలు పెట్టే పాట

  • 'ఏ చోట నువ్వున్నా'' సాంగ్ రిలీజ్ చేసిన యూవీ క్రియేషన్స్
  • ఆగస్టు 30న 'సాహో' రిలీజ్
  • సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన 'సాహో'
ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం 'సాహో'. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కాగా, 'సైకో సయాన్' పేరుతో ఇప్పటికే ఓ సాంగ్ రిలీజ్ చేసిన ఈ చిత్రబృందం తాజాగా 'ఏ చోట నువ్వున్నా' అంటూ సాగే ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేసింది. ఇది ఈ సంవత్సరపు ప్రేమగీతం అవుతుందని, మీ హృదయాలను గిలిగింతలు పెడుతుందని యూవీ క్రియేషన్స్ తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొంది. సుజిత్ దర్శకత్వంలో పూర్తి యాక్షన్ ఎంటర్టయినర్ గా వస్తున్న 'సాహో' ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.
Saaho
Prabhas
Tollywood

More Telugu News