Jagan: సీఎం జగన్ కు ప్రధాన భద్రతాధికారిగా పరమేశ్వరరెడ్డి నియామకం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మరో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పరమేశ్వరరెడ్డి నియమితుడయ్యారు. పరమేశ్వరరెడ్డి ప్రస్తుతం నెల్లూరు అడ్మిన్ విభాగంలో అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు. కాగా, జగన్ కు ఇప్పటికే జోషి ప్రధాన భద్రతాధికారిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రెండో ప్రధాన భద్రతాధికారిగా పరమేశ్వరరెడ్డిని నియమిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. పరమేశ్వరరెడ్డి త్వరలోనే బాధ్యతలు అందుకోనున్నారు.