మాస్ మసాలా పాత్రలను చేసే ఉద్దేశం లేదు: హీరోయిన్ రష్మిక మందన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాస్ మసాలా పాత్రలను చేసే ఉద్దేశం లేదు: హీరోయిన్ రష్మిక మందన

  • వరుస సక్సెస్ లతో వున్న రష్మిక 
  • వెతుక్కుంటూ వస్తోన్న అవకాశాలు
  • నటనకి స్కోప్ వుంటేనే చేస్తానంటోన్న రష్మిక  
'ఛలో' .. 'గీత గోవిందం' సినిమాలు భారీ విజయాలను నమోదు చేయడంతో, రష్మిక క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తాజాగా ఆమె చేసిన 'డియర్ కామ్రేడ్' కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తరువాత సినిమాలను ఆమె మహేశ్ .. అల్లు అర్జున్ .. నితిన్ లతో చేయనుంది.

ఈ నేపథ్యంలో రష్మిక మాట్లాడుతూ .. "ఒక్కసారిగా నాకు వచ్చిన క్రేజ్ కి ఇంకా ఎక్కువ సినిమాలు ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే నాకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే వాటిలో హీరో పక్కన డాన్సులకే పరిమితమయ్యే పాత్రలు, అందాలు ఆరబోసే మసాలా పాత్రలే ఎక్కువగా వున్నాయి. నటనకి అవకాశం లేని అలాంటి పాత్రలను చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ తరహా పాత్రలను ఒప్పుకోవడం లేదు" అని రష్మిక చెప్పుకొచ్చింది. 
Rashmika

More Telugu News