రావల్పిండిలో నివాసాలపై కూలిన విమానం... 15 మంది దుర్మరణం!

  • 27 మందితో ప్రయాణిస్తున్న విమానం
  • అదుపుతప్పి జనావాసాలపై కుప్పకూలిన వైనం
  • 12 మందికి తీవ్ర గాయాలు
పాకిస్థాన్ లోని రావల్పిండి నగరంలోని నివాసాలపై ఓ సైనిక విమానం కుప్పకూలగా, 15 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన నేటి తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో మరో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని అధికారులు స్థానిక ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించగా, ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల్లో విమానంలోని ఐదుగురు సిబ్బంది కాగా, మిగిలినవారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, విమానం బ్లాక్ బాక్స్ కోసం గాలిస్తున్నామని సైనికాధికారి ఒకరు వెల్లడించారు.
Go Back to Shorts
Pakistan
Rawalpindi
Flight
Died

More Telugu News