చంద్రబాబు శాశ్వతంగా రాజకీయాల్లోంచి పారిపోక తప్పదు: ఎమ్మెల్యే రోజా

  • అప్రాప్రియేషన్ బిల్లుపై మాట్లాడలేక బాబు పారిపోయారు
  • చంద్రబాబు పారిపోవడం ఇక్కడితో ఆగదు
  • రైతుల కరవునూ అవినీతిగా మార్చుకున్న అనకొండ చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ శాసనసభలో ఈరోజు ఆమె మాట్లాడుతూ, అప్రాప్రియేషన్ బిల్లుపై మాట్లాడలేక సభ నుంచి చంద్రబాబు పారిపోయారని రోజా విమర్శించారు. చంద్రబాబు పారిపోవడం ఇక్కడితో ఆగదని, జగన్ చేపట్టిన పథకాలు చూసి శాశ్వతంగా రాజకీయాల్లోంచి పారిపోక తప్పదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతుల కరవును కూడా అవినీతిగా మార్చుకున్న అనకొండ చంద్రబాబు అని, రెయిన్ గన్స్ తో కోట్లాది రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తన కొడుకు నారా లోకేశ్ ను గెలిపించుకోలేని దౌర్భాగ్య పరిస్థితి చంద్రబాబుది అని వ్యాఖ్యానించారు. గతంలో 123 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీని 23 మందికి తీసుకువచ్చారంటూ చంద్రబాబు, లోకేశ్ పై సెటైర్లు విసిరారు. అడ్డదారిలో వచ్చిన ఎమ్మెల్సీ పదవితో రాజకీయ పబ్బం గడుపుకుంటున్న లోకేశ్ అమాయకత్వం చూసి నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
YSRCP
mla
Roja

More Telugu News