రష్మీ 'శివరంజని' విడుదల తేదీ ఖరారు
Add ap7am to your home Screen

రష్మీ 'శివరంజని' విడుదల తేదీ ఖరారు

  • రష్మీకి యూత్ లో విపరీతమైన క్రేజ్
  • హారర్ థ్రిల్లర్ గా రానున్న 'శివరంజని'
  • వచ్చేనెల 2వ తేదీన విడుదల
ఒక వైపున 'జబర్దస్త్'తో పాటు ఒకటి రెండు టీవీ షోలు చేస్తోన్న రష్మీ, మరో వైపున అవకాశం లభించినప్పుడల్లా సినిమాలు చేసేస్తోంది. నాయికా ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతూ వెళుతోంది. రొమాన్స్ కి .. హారర్ కి సంబంధించిన కంటెంట్ కి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తోంది.

అలా తాజాగా ఆమె చేసిన మరో హారర్ మూవీనే 'శివరంజని'. నాగ ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మీ జోడీగా 'నందూ' నటించాడు. అయ్యన్న నాయుడు - పద్మనాభ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ విడుదలకి తేదీని ఖరారు చేశారు. ఆగస్టు 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. కొంత గ్యాప్ తరువాత రష్మీ నుంచి వస్తోన్న  ఈ సినిమా, ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి మరి.
Rashmi
Nandu

More Telugu News