Roja Ramani: కర్ర తీసుకుని శారద గారు నిజంగానే నన్ను కొట్టేశారు: నటి రోజా రమణి

షార్ట్స్‌లో చూడండి
నటిగా సుదీర్ఘ కాలంగా తన కెరియర్ ను కొనసాగిస్తూ వచ్చిన రోజా రమణి, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. తెలుగులో వచ్చిన 'మనుషులు మారాలి' సినిమాను తమిళంలో చేశారు. తమిళంలోను శారదగారే చేశారు. తమిళంలో నేను ఆమె కూతురిగా చేశాను.

కథా పరంగా పేదరికం కారణంగా తినడానికి మా ఇంట్లో ఏమీ ఉండదు. ఆకలికి తట్టుకోలేక నేను ఒక 'బన్ను' దొంగిలిస్తాను. ఆ పని చేసినందుకు తల్లిగా శారద గారు నన్ను కర్రతో కొట్టాలి. పాత్రలో పూర్తిగా ఇన్వాల్వైపోయిన ఆమె, నిజంగానే నన్ను కొట్టేశారు. నా ఒళ్లంతా వాతలు తేలిపోయాయి. సీన్ ఓకే అయిన తరువాత 'నన్ను క్షమించమ్మా' అంటూ నన్ను పట్టుకుని ఆమె ఏడ్చేశారు" అంటూ చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Roja Ramani
Sharada

More Telugu News