Andhra Pradesh: పెట్టుబడులపై దృష్టి సారించిన సీఎం జగన్.. భారీ స్థాయిలో పారిశ్రామిక సదస్సుకు ఏర్పాట్లు!

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో నవరత్నాలతో సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా కంపెనీలను ఆకర్షించేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 9న ‘ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్’ చేపట్టాలని నిర్ణయించారు. విజయవాడలో ఈ సదస్సును నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సదస్సుకు 40 దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు హాజరు కానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో తాము చేపడుతున్న విద్యుత్ సంస్కరణలు, జ్యుడీషియల్ కమిషన్, పారిశ్రామిక రాయితీలు, అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ విదేశీ ప్రతినిధులకు వివరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ సదస్సుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే మొదలుపెట్టారు. అయితే విజయవాడలో ఈ సదస్సును ఎక్కడ నిర్వహిస్తారన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
Chief Minister
investment summit
september 09
Vijayawada
YSRCP

More Telugu News