Madhunandan: ఆ సినిమా చేసుంటే నా కెరియర్ వేరేలా వుండేది: కమెడియన్ మధునందన్

షార్ట్స్‌లో చూడండి
కమెడియన్ గా చిత్రపరిశ్రమలోకి మధునందన్ అడుగుపెట్టి 20 ఏళ్లకి పైనే అవుతోంది. ఇంతకాలంగా కొనసాగుతోన్న తన కెరియర్ ను గురించి ఆయన తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. "నేను ఆశించిన స్థాయిలో నా కెరియర్ ఊపందుకోకపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు. సరైన సమయంలో సరైన అవకాశాలు రాకపోవడం వలన కావొచ్చు.

నిజానికి 'ఎక్స్ ప్రెస్ రాజా' సినిమాలో నేను మంచి రోల్ చేయవలసి వుంది. నేను ఆ సినిమా షూటింగుకి వెళ్లవలసి వుంది. అయితే అంతకు ముందు నేను 'స్పీడున్నోడు' సినిమా ఒక రోజు షూటింగు చేసి వున్నాను. ఆ తరువాత 'స్పీడున్నోడు' వాళ్లు .. 'ఎక్స్ ప్రెస్ రాజా' వాళ్లు సేమ్ డేట్స్ పంపించారు. ముందే 'స్పీడున్నోడు' కమిటైనందువలన 'ఎక్స్ ప్రెస్ రాజా' వదులుకోవలసి వచ్చింది. ఆ సినిమా చేసుంటే నా కెరియర్ వేరేలా ఉండేది" అని ఆయన చెప్పుకొచ్చాడు. 
Go Back to Shorts
Madhunandan

More Telugu News