'సాహో' నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో' నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్

  • భారీ చిత్రంగా రూపొందిన 'సాహో'
  • ఆసక్తిని పెంచుతోన్న యాక్షన్ సీన్స్ 
  • వచ్చేనెల 30వ తేదీన విడుదల  
ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందింది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు. ఇది యాక్షన్ సీన్ కి సంబంధించిన పోస్టర్. గ్లాస్ డోర్స్ కి అవతల విలన్ గ్యాంగ్ .. ఇవతల హీరో హీరోయిన్లు గన్స్ తో కాల్పులు జరుపుతోన్న సీన్, హాలీవుడ్ యాక్షన్ మూవీని గుర్తుచేస్తోంది.

ఆగస్టు 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా భారీతనం .. యాక్షన్ ఎపిసోడ్స్ లోని ప్రత్యేకతలు బయటికి వచ్చిన దగ్గర నుంచి అందరిలో మరింతగా ఆసక్తి పెరిగింది. 'బాహుబలి 2' తరువాత ప్రభాస్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.  
Prabhas
Shraddha kapoor

More Telugu News