హిందూ పూజారిపై అమెరికాలో దాడి!

షార్ట్స్‌లో చూడండి
అమెరికాలోని గ్రీన్‌ ఓక్స్‌ ప్రాంతంలోని శివ శక్తి పీఠంలో పూజారిగా ఉన్న హరీశ్ చందర్ పూరిపై దాడి జరిగింది. పీఠం సమీపంలోనే ఈ దాడి జరగడం గమనార్హం. హరీష్‌ చందర్‌ నడుచుకుంటూ వెళుతుండగా, వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి ఆయన్ను పలుమార్లు కొట్టాడు. ఈ ఘటనలో స్వామీజీకి గాయాలు కాగా, ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి సెర్జియ గువెయ (52)గా గుర్తించిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఈ దాడిని విద్వేష దాడని, స్వామీజీని లక్ష్యంగా చేసుకుని ఇది జరిగిందని ఆయన శిష్యులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. దాడికి పాల్పడే ముందు సెర్జియ, ఇది తమ ప్రాంతమని నినాదాలు చేసినట్టు తెలుస్తోంది. గాయాల నుంచి తాను నిదానంగా కోలుకుంటున్నానని, తనపై దాడికి దిగిన వ్యక్తి కోసం కూడా ప్రార్థిస్తానని హరీశ్ చందర్ వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
USA
Priest
Attack
Green Oaks

More Telugu News