విశాఖపట్నంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు.. గిరిజనులను హత్యచేయడంపై ఆగ్రహం!
- చింతపల్లి మండలం వీరవరంలో ఘటన
- భాస్కరరావు, సత్తిబాబును చంపేసిన మావోలు
- పోలీసులకు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారని ఆరోపణ
‘మావోయిస్టుల్లారా.. మీ సిద్ధాంతాలకు మద్దతు ఇచ్చినంత కాలం మా గ్రామం మంచిదా? మిమ్మల్ని, మీ సిద్ధాంతాలను వ్యతిరేకించినందుకు వీరవరం గ్రామంపై దాడి చేస్తారా? అప్పుడు సంజీవరావును చంపారు. ఇప్పుడు సంజీవరావు అన్న భాస్కరరావు, బావమరిది సత్తిబాబులను చంపారు. ఇదేనా మీ సిద్దాంతం?’ అని పోస్టర్లలో రాశారు.